పాఠశాలలో పాము కలకలం

పాఠశాలలో పాము కలకలం

ADB: బేల మండల కేంద్రంలోని అశోక్ నగర్ కాలనీలో పాము కలకలం రేపింది. బుధువారం అంగన్వాడీ కేంద్రానికి వచ్చిన చిన్నారులు మధ్యాహ్నం భోజనం తిన్న అనంతరం పక్కనున్న రూమ్‌లో నాగుపామును చూసి భయాందోళనకు గురయ్యారు. టీచర్, పిల్లలు కేకలు వేయడంతో స్థానికులు అక్కడకు చేరుకొని పామును పట్టుకున్నారు.