ట్రాన్స్ ఫార్మర్ ధ్వంసం.. కాపర్ వైరు చోరీ
KMR: బిక్కనూరు మండలంలోని రామేశ్వర్‌పల్లి శివారులో గుర్తుతెలియని దుండగులు నిన్న ఓ విద్యుత్ ట్రాన్స్ ఫార్మర్‌ను ధ్వంసం చేసి, అందులోని కాపర్ కాయల్, వైర్‌ను చోరీ చేశారు. విద్యుత్ అధికారులకు రైతు వెంకటేష్ సమాచారం అందించగా, ఏఈ సంకీర్త్, ఘటనా స్థలాన్ని పరిశీలించి పోలీసులకు ఫిర్యాదు చేశారు. గత కొంతకాలంగా ఇలాంటి చోరీ ఘటనలు పెరుగుతున్నాయని రైతులు ఆందోళన వ్యక్తం చేశారు.