'అభిప్రాయం తీసుకున్న తర్వాతే క్వారీ నిర్వహణ చేయాలి'

'అభిప్రాయం తీసుకున్న తర్వాతే క్వారీ నిర్వహణ చేయాలి'

మన్యం: ప్రజల అభిప్రాయాన్నిపూర్తి స్థాయిలో తీసుకుని బడిదేవరకొండ క్వారీ నిర్వహణ చేపట్టాలని ఎమ్మెల్యే బోనెల విజయ్ చంద్ర అన్నారు. బడిదేవరకొండ వల్ల తమకు చాలా ఇబ్బందులు ఎదురవుతున్నాయని, చెరువు కలుషితం అయిందని, వెంటనే ఈ క్వారీ నిర్వహణ ఆపాలని ప్రజలు ఇచ్చిన ఫిర్యాదు మేరకు గురువారం కొండను ఎమ్మెల్యే పరిశీలించారు.