కాజీపేటలో రాజీవ్ గాంధీ జయంతి వేడుకలు

KDP: కాజీపేటలో బుధవారం కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ జయంతి వేడుకలను నిర్వహించారు. ఈ సందర్భంగా రాజీవ్ గాంధీ చిత్రపటానికి పూలమాలవేసి ఘన నివాళులర్పించారు. అనంతరం ఐటీ రంగానికి రాజీవ్ గాంధీ చేసిన సేవలను కొనియాడారు. కడప జిల్లా ఎస్సీ సెల్ మాజీ అధ్యక్షులు వెంకటరమణ, మండల కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.