కర్నూలు బకాయిదారుల ఆస్తి జప్తుకు ఆదేశం
కర్నూలు నగరపాలక కమిషనర్ పి.విశ్వనాథ్ పన్నులు చెల్లించని బకాయిదారుల ఆస్తులను వెంటనే జప్తు చేయాలని ఆదేశించారు. సోమవారం రెవెన్యూ, ఇంజినీరింగ్ అధికారులతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించి తాగునీటి ఛార్జీల వసూళ్లపై సమీక్షించారు. అధికారులు లక్ష్యాలను సకాలంలో పూర్తి చేయాలని ఆయన సూచించారు.