'దసరా ఉత్సవాలకు రావాలని ఎమ్మెల్యేకి ఆహ్వానం'

ELR: దసరా ఉత్సవాలకు రావాలని నిడమర్రు మండలం తోకలపల్లి ఉత్సవ కమిటీ ఉంగుటూరు ఎమ్మెల్యే ధర్మరాజుకు ఆహ్వాన పత్రం అందజేశారు. శనివారం తోకలపల్లి ఉత్సవ కమిటీ ఉంగుటూరు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం వద్ద ఎమ్మెల్యే ధర్మరాజును కలుసుకున్నారు. అనంతరం ఎమ్మెల్యేను ఉత్సవ కమిటీ సన్మానించారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు తదితరులు పాల్గొన్నారు.