ఉరేసుకుని యువకుడు ఆత్మహత్య
MHBD: సిరోలు మండలంలోని శీతల తండాకు చెందిన ధరంసోత్ సురేష్(23) అనే యువకుడు ఇవాళ ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. సురేష్ ఆత్మహత్యకు కుటుంబ కలహాలే కారణమని సమాచారం. ఏడాది క్రితమే సురేష్‌కు వివాహం అయింది. మృతుడి తండ్రి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.