మద్యం మత్తులో వాహనం నడిపితే జైలుకే: ఎస్పీ

మద్యం మత్తులో వాహనం నడిపితే జైలుకే: ఎస్పీ

KMR: జిల్లాలో నిర్వహించిన డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీల్లో 80 మందిపై కేసులు నమోదయ్యాయి. వీరికి కోర్టు రూ.1.22 లక్షల జరిమానాతో పాటు, ఆరుగురికి రెండు రోజుల జైలు శిక్ష విధించినట్లు ఎస్పీ రాజేష్ చంద్ర తెలిపారు. క్షణికానందం కోసం మద్యం సేవించి కుటుంబాలను రోడ్డున పడేయవద్దని, నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు తప్పవని ఆయన హెచ్చరించారు.