VIDEO: వైద్యుల నిర్లక్ష్యంతో పసిపాప మృతి

VIDEO: వైద్యుల నిర్లక్ష్యంతో పసిపాప మృతి

SRPT: సూర్యాపేటలో వైద్యుల నిర్లక్ష్యంతో పసికందు మృతిచెందిందని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. వారు తెలిపిన వివరాలిలా.. చివ్వెంల మండలం ఎంజీ నగర్ తండాకు చెందిన శ్రావణికి పురిటినొప్పులు రాగా ఆస్పత్రికి తీసుకొచ్చారు. సకాలంలో వైద్యం అందించకపోవడంతో శిశువు మృతి చెందింది. తొమ్మిది నెలలు నిండిన తన బిడ్డను సిబ్బంది నిర్లక్ష్యమే బలి తీసుకుందని ఆరోపించారు.