VIDEO: నిజాంసాగర్ ప్రాజెక్టులో 11, 887 క్యూసెక్కుల వరద

VIDEO: నిజాంసాగర్ ప్రాజెక్టులో 11, 887 క్యూసెక్కుల వరద

KMR: నిజాంసాగర్ ప్రాజెక్టు జలాశయంలో ఆదివారం ఎగువ మంజీరా నుంచి 11,887 క్యూసెక్కుల వరద రావడంతో, 2 గేట్ల ద్వారా 14,564 క్యూసెక్కుల నీటిని దిగువ మంజీరా ద్వారా గోదావరిలోకి విడుదల చేస్తున్నారు. 1405 అడుగుల సామర్థ్యం గల ప్రాజెక్టులో ప్రస్తుతం 1404.52 అడుగుల నీరు నిల్వ ఉంది. నీటి ప్రవాహం ఉద్ధృతంగా ఉండటంతో నది పరివాహక ప్రాంత ప్రజలను అప్రమత్తం చేశారు.