3 గ్రామాల ప్రజలకు నీటి సమస్యకు పరిష్కారం

3 గ్రామాల ప్రజలకు నీటి సమస్యకు పరిష్కారం

ASF: జైనూర్ మండలంలో తాగునీటి సమస్యలను పరిష్కరించేందుకు మాజీ ఎమ్మెల్యే ఆత్రం సక్కు చర్యలు చేపట్టారు. ఇవాళ జెండగుడా, అలిగూడా, లెండిగుడా గ్రామాల్లో తాగునీటి కొరతను నివారించేందుకు మూడు బోర్లు వేయించారు. గ్రామాల్లో నీటి సమస్య తీవ్రంగా ఉండటంతో ప్రత్యక్షంగా వెళ్లి పరిస్థితులను పరిశీలించి వెంటనే బోర్లు త్రవ్వించి ప్రజలకు ఉపశమనం కల్పించారు.