వాసవి బ్రిందావనం సమస్యలు పరిష్కరిస్తాం: ప్రెసిడెంట్
HYD: జూబ్లీహిల్స్ ఉపఎన్నికల ప్రచారంలో భాగంగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్ రావు, వాసవి బ్రిందావనం రెసిడెన్షియల్ సొసైటీని సందర్శించి నివాసితులు, ఉదయం వాకర్స్‌తో ఆత్మీయంగా మాట్లాడారు. ప్రజలు ప్రస్తావించిన డ్రైనేజ్, రహదారులు, పౌరసౌకర్యాల సమస్యలను శ్రద్ధగా విని, వీటి పరిష్కారానికి బీజేపీ అభ్యర్థి లంకల దీపక్ రెడ్డి స్వయంగా కృషి చేస్తారని హామీ ఇచ్చారు.