ఇల్లందకుంటలో ‘పోషణ్ అభియాన్' కార్యక్రమం

ఇల్లందకుంటలో ‘పోషణ్ అభియాన్' కార్యక్రమం

KNR: ఇల్లందకుంట అంగన్వాడీ కేంద్రంలో ఐసీడీఎస్ ఆధ్వర్యంలో 'పోషణ్ అభియాన్' కార్యక్రమం ప్రారంభించారు. ఈ మేరకు 15 మంది గర్భిణులకు సంప్రదాయబద్ధంగా సీమంతాలు నిర్వహించారు. నలుగురు చిన్నారులకు అన్నప్రాశన చేశారు. గర్భిణులు, బాలింతలు పౌష్టికాహారం తీసుకోవడం ఎంతో అవసరమని సీడీపీవో సుగుణ తెలిపారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ ధార సురేశ్, తహసీల్దార్ భాస్కర్ పాల్గొన్నారు.