వైసీపీకి టీచర్లు బుద్ధి చెప్పాలి: లోకేష్

వైసీపీకి టీచర్లు బుద్ధి చెప్పాలి: లోకేష్

AP: రాష్ట్రంలో వైసీపీ టీచర్లపై ఫేక్ ప్రచారం చేస్తోందని మంత్రి నారా లోకేష్ మండిపడ్డారు. టీచర్ల ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీసేలా వైసీపీ ప్రవర్తిస్తోందని ధ్వజమెత్తారు. ఓ టీచర్ మద్యం తాగి బెంచీ కింద పడుకున్న ఘటన వేరే రాష్ట్రంలో జరిగితే.. వైసీపీ దాన్ని ఏపీలో జరిగినట్లు పోస్టు చేయడం బాధాకరమని తెలిపారు. గురువుల పట్ల విమర్శలు చేసి.. వైసీపీ మరో మెట్టు కిందికి దిగజారిందన్నారు.