మోటార్ వెహికల్ ఇన్‌స్పెక్టర్ తనిఖీలు
NLR: వెంకటాచలం మండలం పరిధిలోని టోల్ ప్లాజా వద్ద మోటార్ వెహికల్ ఇన్‌స్పెక్టర్ సోమవారం తనిఖీలు నిర్వహించారు. లైసెన్సులు, హెల్మెట్ లేని వారికి జరిమానాలు విధించారు. ఈ సందర్భంగా ఆయన హైవేపై విస్తృతంగా తనిఖీలు చేశారు. ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని సూచించారు. అలాగే రోడ్డు నిబంధనలను ప్రతి ఒక్కరూ పాటించాలన్నారు.