ప్రజా బాట ప్రోగ్రామ్‌లో పాల్గొన్న డీఈ బాల్యనాయక్
NLG: దేవరకొండలో విద్యుత్ శాఖ ఆధ్వర్యంలో శనివారం ప్రజా బాట కార్యక్రమంలో భాగంగా ట్రాన్స్‌ఫార్మస్ వద్ద క్లీనింగ్ ప్రోగ్రాం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో విద్యుత్ శాఖ డీఈ బి.బాల్యనాయక్ పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ.. ట్రాన్స్‌ఫార్మర్ల వద్ద చెత్తాచెదారం, పిచ్చి మొక్కలు లేకుండా పరిశుభ్రంగా ఉండేలా చర్యలు చేపట్టాలన్నారు. ఈ కార్యక్రమంలో ఏఈ రాజేష్, తదితరులు పాల్గొన్నారు.