డయాలసిస్ సెంటర్‌ను విస్తరించాలని మంత్రిని కోరిన MLA

డయాలసిస్ సెంటర్‌ను విస్తరించాలని మంత్రిని కోరిన MLA

ASF: కాగజ్‌నగర్ పట్టణంలోని డయాలసిస్ సెంటర్‌ను విస్తరించాలని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహని MLA పాల్వాయి హరీష్ బాబు కోరారు. బుధవారం ఆరోగ్య శ్రీ కార్యాలయం వద్ద మంత్రిని కలిశారు. కాగజ్‌నగర్ డయాలసిస్ సెంటర్లో 5 పడకలు మాత్రమే ఉన్నాయని, దీనిని 10 పడకలుగా దీనిని విస్తరించాలని కోరారు. అలాగే కౌటాల PHCలో మరో డయాలసిస్ సెంటర్ మంజూరు చేయాలన్నారు.