డుంబ్రిగుడలో పోషణ పక్వవాడ కార్యక్రమం
ASR: డుంబ్రిగుడ పీహెచ్‌సీలో పోషణ పక్వవాడ కార్యక్రమాన్ని ఇవాళ నిర్వహించారు. ఈ కార్యక్రమం ఈనెల 8 నుంచి 23 వరకు నిర్వహించనున్నట్లు ఐసీడీఎస్ సీడీపీవో ఎస్తేరు రాణి, తెలిపారు. గర్భిణీలు చిరుధాన్యాలు, పప్పులు, ఆకుకూరలు, పాలు, గుడ్లు ఆహారంలో భాగం చేసుకోవాలని సూచించారు. అలాగే, గర్భిణీలు కనీసం నాలుగు సార్లు వైద్య పరీక్షలు చేయించుకోవాలన్నారు.