నెల్లూరులో హై టెన్షన్.. పోటాపోటీ ఫిర్యాదులు
నెల్లూరులో రాజకీయాలు భగ్గుమన్నాయి. టీడీపీ కార్పొరేటర్లను వైకాపా ప్రలోభపెడుతోందన్న ఆరోపణలతో ఉద్రిక్తత నెలకొంది. వైసీపీ బెదిరిస్తోందని టీడీపీ నేత కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి, తమ వారిని కిడ్నాప్ చేశారని వైకాపా నేత అనిల్ వేర్వేరుగా పోలీసులకు ఫిర్యాదు చేశారు. రెండు పోలీస్ స్టేషన్ల వద్ద కార్యకర్తలు భారీగా తరలిరావడంతో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.