టీడీపీ కార్యకర్త కుటుంబానికి ఎమ్మెల్యే పరామర్శ
సత్యసాయి: కదిరి రూరల్ మండలం మల్లయ్యగారిపల్లికి చెందిన టీడీపీ సీనియర్ కార్యకర్త, స్టోర్ డీలర్ రామచంద్ర రెడ్డి(55) బుధవారం గుండెపోటుతో మృతి చెందారు. గుండెల్లో నొప్పి రావడంతో ఆసుపత్రికి తరలించగా, అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. ఆయన మృతి పట్ల ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. కుటుంబ సభ్యులను పరామర్శించారు.