ఘనంగా ముత్యాలమ్మ తల్లి బోనాలు.!

ఘనంగా ముత్యాలమ్మ తల్లి బోనాలు.!

KMM: తిరుమలాయపాలెం మండలం రఘునాథపాలెంలో బుధవారం ముత్యాలమ్మ తల్లి బోనాల కార్యక్రమం నిర్వహించారు. ముందుగా గ్రామ మహిళలు బోనాలను తయారుచేసి ఆపై ఎత్తుకొని డప్పు చప్పుల నడుమ సంప్రదాయ నృత్యం చేస్తూ ప్రదర్శనగా వెళ్లి అమ్మవారికి బోనాలను సమర్పించారు. ఈ సందర్భంగా అమ్మవారికి మహిళలు ప్రత్యేక పూజలు జరిపారు. అనంతరం అమ్మవారికి మొక్కులు చెల్లించారు.