లెబనాన్‌పై ఇజ్రాయెల్ దాడులు.. 31 మంది మృతి
లెబనాన్‌లోని హెజ్‌బొల్లా నేతల లక్ష్యంగా ఇజ్రాయెల్ భీకర దాడులు చేసింది. ఈ ఘటనలో హెజ్‌బొల్లా బ్లాక్ అధినేత మహ్మద్ రాడ్‌తో పాటు 31 మంది మృతి చెందారు. మరో 149 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఈ విషయాన్ని లెబనాన్ ప్రభుత్వం ప్రకటించింది. హెజ్‌బొల్లా రాకెట్ దాడులకు ప్రతీకారంగా ఇజ్రాయెల్ క్షిపణులను ప్రయోగించింది.