VIDEO: మేడిగడ్డ బ్యారేజీ పిల్లర్ల కుంగుబాటు.. పునర్నిర్మాణంపై సమీక్ష
BHPL: మహదేవపూర్ మండలం మేడిగడ్డ ప్రాజెక్టులో 2023లో పిల్లర్లు కుంగిన ఘటనపై నేడు సీఎం రేవంత్ రెడ్డి స్థాయి సమీక్ష జరగనుంది. పిల్లర్ల సమీపంలో 22 మీటర్ల లోతు, ఒక మీటర్ వ్యాసంతో ఏర్పడిన బుంగ కారణంగానే కుంగుబాటు జరిగినట్లు ఇంజనీరింగ్ బృందాలు పేర్కొన్నాయి. ఎన్డీఎస్ఏ సూచనల మేరకు 33 నెలలుగా పరీక్షలు కొనసాగుతుండగా, పునర్నిర్మాణ పనులు వేగవంతం అయ్యే అవకాశం ఉంది.