VIDEO: ఘనంగా శ్రీ రాజరాజేశ్వర స్వామి వారి పల్లకి సేవ
JGL: పెగడపల్లి మండల కేంద్రంలోని గల శ్రీ స్వయంభూ రాజరాజేశ్వర స్వామి ఆలయంలో ఆలయ కమిటీ ఆధ్వర్యంలో పార్వతీ పరమేశ్వరుల పల్లకి సేవ సోమవారం అత్యంత వైభవపేతంగా జరిగింది. రంగురంగుల పూలతో అలంకరించిన పల్లకిలో స్వామివార్ల ఉత్సవ విగ్రహాలను ప్రతిష్ఠించి ఊరేగింపు చేశారు. భక్తులు ఉత్సాహంగా పల్లకి సేవలు భక్తిశ్రద్ధలతో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు.