మండల అధ్యక్షుడుని పరామర్శించిన నైరుతి రెడ్డి

ATP: జిల్లా వైసీపీ ఉపాధ్యక్షురాలు నైరుతి రెడ్డి పాత కొత్తచెరువు గ్రామంలో గురువారం పర్యటించారు. వైసీపీ మైనారిటీ మండల అధ్యక్షుడు ఫక్రుద్దీన్ కాలు ఫ్రాక్చర్ అయిన విషయం తెలుసుకున్న ఆమె ఆయన ఇంటికి వెళ్లి పరామర్శించారు. త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. అనంతరం ఆయన ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు పాల్గొన్నారు.