రాష్ట్రస్థాయి ఛాంపియన్స్‌గా కర్నూల్ జట్టు
కర్నూల్ నగర శివారులోని ఆదర్శ విద్యా మందిర్ క్రీడా మైదానంలో జరిగిన 69 SHF రాష్ట్ర స్థాయి రబ్బి ఛాంపియన్‌షిప్‌లో కర్నూల్ బాలురు జట్టు విజేతగా నిలిచి కప్పును గెలుచుకుంది. బాలికల జట్టు మూడో స్థానం సాధించింది. విజేతలకు డైరెక్టర్ డాక్టర్ హరికిషన్, రాష్ట్ర రెడ్డి అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి రామాంజనేయులు బహుమతులు అందజేశారు.