'ప్రజావాణి దరఖాస్తులను తక్షణమే పరిష్కరించాలి'

'ప్రజావాణి దరఖాస్తులను తక్షణమే పరిష్కరించాలి'

WGL: కలెక్టర్ కార్యాలయంలోని కాన్ఫరెన్స్ హాల్‌లో ఇవాళ నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో కలెక్టర్ డా. సత్య శారద పాల్గొని ప్రజల నుంచి దరఖాస్తులు స్వీకరించారు. ఈ మేరకు ఆమె మాట్లాడుతూ.. ప్రజావాణిలో వచ్చిన దరఖాస్తులను ఆలస్యం చేయకుండా సంబంధిత అధికారులు తక్షణమే స్పందించాలని ఆదేశించారు. అలాగే, ప్రజలు ప్రజావాణిని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.