ఢిల్లీ విమానాశ్రయంలో పలు విమానాలు రద్దు

పాక్‌తో యుద్ధం జరుగుతున్న వేళ ఢిల్లీ విమానాశ్రయంలో ఇవాళ పలు విమానాలను రద్దు చేశారు. 9 అంతర్జాతీయ, 129 దేశీయ విమాన సర్వీసులను రద్దు చేసినట్లు అధికారులు ప్రకటించారు. అయితే ఢిల్లీ విమానాశ్రయం మాత్రం తెరిచే ఉంచినట్లు విమానాయానశాఖ వెల్లడించింది. కొన్ని సర్వీసులను మాత్రమే రద్దు చేసినట్లు పేర్కొంది.