VIDEO: ప్రియుడి ఇంటిపై దాడి.. తండాలో ఉద్రిక్తత
MHBD: గూడూరు మండలం వాగ్యతండాలో మంగళవారం ఉద్రిక్తత నెలకొంది. ఏడేళ్లుగా ప్రేమించి పెళ్లి చేసుకుంటా అని నమ్మించి మోసం చేశాడని ఆరోపిస్తూ బాధితురాలు స్పందన ప్రియుడు తేజావత్ రఘురాం ఇంటి ముందు మౌన నిరసన చేపట్టింది. ఈ క్రమంలో గుర్తుతెలియని వ్యక్తులు రఘురాం ఇంటి తాళం పగలగొట్టి, ఇంట్లోని వస్త్రాలను రోడ్డుపైకి విసిరివేసి, గడ్డివాముకు నిప్పంటించి దగ్ధం చేశారు.