'జాబ్ మేళాను సద్వినియోగం చేసుకోండి'

'జాబ్ మేళాను సద్వినియోగం చేసుకోండి'

PPM: రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ పార్వతీపురం మన్యం జిల్లా ఆధ్వర్యంలో డిసెంబర్ 3న పార్వతీపురం గాయత్రి డిగ్రీ కళాశాలలో జరగబోయే జాబ్ మేళాను నిరుద్యోగ యువత సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్యే బోనెల విజయచంద్ర అన్నారు. శనివారం స్థానిక తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో జాబ్ మేళాకు సంబంధించిన గోడ పత్రికను ఎమ్మెల్యే ఆవిష్కరించారు.