100కుపైగా విమానాలు రద్దు.. ప్రయాణికుల ఫైర్
ఢిల్లీలో పొగమంచు కారణంగా 100కుపైగా విమానాలు రద్దు చేశారు. అంతేకాకుండా 300కు పైగా విమానాలు ఆలస్యంగా నడుస్తున్నాయి. దీంతో టీ3 టెర్మినల్‌లో ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు. అయితే ముందస్తు సమాచారం ఇవ్వలేదని అధికారులపై ప్రయాణికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.