బస్సులు లేక విద్యార్థుల అవస్థలు..
ఉమ్మడి KNR జిల్లాలో ఎలాంటి పరిస్థితి ఉందో తెలిపే ఘటన ఇది. మానకొండూరు మండలం పోచంపల్లి మోడల్ స్కూల్ విద్యార్థినులు బస్సులు లేక రాత్రయినా రోడ్డుపై ఎదురుచూస్తూ కనిపించారు. అసలే చీకటి, సీసీ కెమెరాలు లేని ప్రాంతం, అమ్మాయిల భద్రతకు బాధ్యత ఎవరు వహిస్తారని తల్లిదండ్రులు ప్రశ్నిస్తున్నారు. అధికారులు వెంటనే స్పందిచి బస్సుల సౌకర్యం కల్పించాలని విద్యార్థినుల తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.