VIDEO: రోడ్డుపై మురికి నీరు.. ఇబ్బందుల్లో ప్రజలు
NLR: పేరుకే మున్సిపాలిటీ. ఎక్కడ చూసినా సమస్యలతో సతమతం. అదే బుచ్చిరెడ్డిపాలెం పట్టణ పరిస్థితి! దీనికి ఉదాహరణ పైన కనిపిస్తున్న వీడియోనే నిదర్శనం. పట్టణంలోని పుట్ట వీధిలో గుడిపల్లి కాలువ నిర్మాణం చేపడుతున్న నేపథ్యంలో మురికి నీరు రోడ్డుపైకి చేరి ప్రజలు అవస్థలు పడుతున్నట్లు తెలిపారు. దీనిపై అధికారులు ప్రత్యామ్నాయ చర్యలు చేపట్టాలని స్థానిక ప్రజలు కోరుతున్నారు.