హోటల్ నిర్వాహకులకు జరిమానా

హోటల్ నిర్వాహకులకు జరిమానా

KMM: ఖమ్మం 20వ డివిజన్‌లోని మమతా రోడ్డులో ఓ హోటల్ నిర్వాహకులకు కేఎంసీ అధికారులు శనివారం జరిమానా విధించారు. అధికారుల పరిశీలనలో హోటల్‌కు ట్రేడ్ లైసెన్స్ లేకపోవడం, హోటల్‌లో సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వినియోగిస్తుండడంతో రూ. 5వేల జరిమానా విధించారు. అదేవిధంగా, హోటల్‌లో ఉపయోగిస్తున్న సుమారు 2 కిలోల సింగిల్ యూజ్ ప్లాస్టిక్ ను స్వాధీనం చేసుకున్నారు.