VIDEO: శ్రీ అయ్యప్పస్వామి దేవాలయంలో 'విష్' వేడుకలు
BHNG: యాదగిరిగుట్ట శ్రీ అయ్యప్పస్వామి దేవాలయంలో 'విష్' వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఉదయం గణపతి హోమం, కుమారస్వామికి, అమ్మవారికి, నవగ్రహాలకు ప్రత్యేక పూజలు నిర్వహించి, కేరళ ఆచారం ప్రకారం విష్ పూజలు చేశారు. అనంతరం పడిపూజ నిర్వహించి, అన్నదానం చేశారు. ఈ కార్యక్రమంలో ఆలేరు కమిటీ సభ్యులు, స్థానికులు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.