నేటి నుంచి పత్తి కొనుగోళ్లు ప్రారంభం
ADB: ఆదిలాబాద్ వ్యవసాయ మార్కెట్‌లో బుధవారం నుంచి పత్తి కొనుగోళ్లు చేపట్టనున్నట్లు కమిటీ అధికారులు తెలిపారు. రాష్ట్ర జిన్నింగ్ మిల్లుల అసోసియేషన్ తలపెట్టిన బంద్‌ను విరమించుకున్న నేపథ్యంలో ఆదిలాబాద్ మార్కెట్ యార్డులో సీసీఐ, ప్రైవేటు ద్వారా పత్తి కొనుగోళ్లు యథావిధిగా నడుస్తాయని వెల్లడించారు. ఈ విషయాన్ని రైతు సోదరులు గమనించాలని సూచించారు.