'ఖచ్చితమైన గణాంకాలతోనే దేశాభివృద్ధి'

'ఖచ్చితమైన గణాంకాలతోనే దేశాభివృద్ధి'

PPM: దేశ భవిష్యత్తు ప్రణాళికల రూపకల్పనలో జనగణన అత్యంత కీలకమని, ఎన్యూమరేటర్లు క్షేత్రస్థాయిలో ఖచ్చితమైన వివరాలను సేకరించాలని సబ్ కలెక్టర్ వైశాలి పేర్కొన్నారు. ఎంపీడీవో కార్యాలయంలో మే 1 నుంచి మే 31 వరకు జరగనున్న 'హౌస్ లిస్టింగ్' ఆపరేషన్స్ (గృహ గణన) నిమిత్తం ఎన్యూమరేటర్లు, సూపర్‌వైజర్లకు నిర్వహించిన మూడు రోజుల శిక్షణా కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు.