CMRF చెక్కులను పంపిణీ చేసిన ఎమ్మెల్యే
BPT: కొల్లూరు మండలానికి చెందిన 8 మంది అనారోగ్యంతో ప్రైవేట్ ఆసుపత్రుల్లో చికిత్స పొందిన వారికి ప్రభుత్వం చేయూతగా నిలిచింది. ముఖ్యమంత్రి సహాయనిధి నుంచి రూ. 5,75,395లు మంజూరు చేయబడ్డాయి. ఈ నిధిని చెక్కుల రూపంలో లబ్ధిదారుల కుటుంబ సభ్యులకు వేమూరు ఎమ్మెల్యే నక్కా ఆనందబాబు శనివారం అందజేశారు. ఈ కార్యక్రమంలో పార్టీ నేతలు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.