వ్యవసాయ శాఖకు ప్రథమ బహుమతి

ఏలూరులో జరిగిన స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో భాగంగా ప్రభుత్వ శాఖలు ఏర్పాటు చేసిన స్టాల్స్ అందరినీ ఆకట్టుకున్నాయి. గృహ నిర్మాణ శాఖ మంత్రి పార్థసారథి, కలెక్టర్ వెట్రిసెల్వి స్టాల్స్‌ను పరిశీలించారు. ఈ మేరకు జిల్లా వ్యవసాయ సాధికారిక సంస్థ మొదటి బహుమతి, ఉద్యానవన శాఖ రెండో బహుమతి, మహిళా శిశు సంక్షేమ శాఖ మూడో బహుమతి గెలుచుకున్నాయి.