ప్రారంభమైన పీజీ రెండవ సెమిస్టర్ పరీక్షలు

MBNR: జిల్లా కేంద్రంలోని పాలమూరు యూనివర్సిటీలో పీజీ రెగ్యులర్, బ్యాక్ లాగ్ రెండవ సెమిస్టర్ పరీక్షలు మంగళవారం నుంచి ప్రారంభమయ్యాయి. నేటి పరీక్షలను రిజిస్ట్రార్ ప్రొఫెసర్ రమేష్ బాబు, పరీక్షల నియంత్రణ అధికారి డాక్టర్ ప్రవీణ్ పీజీ కాలేజ్ ప్రిన్సిపల్ డా.మధుసూదన్ రెడ్డి పర్యవేక్షించారు. నేడు నిర్వహించిన పరీక్షలకు 781 మంది విద్యార్థులు హాజరయ్యారని వారు తెలిపారు.