విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవాల్లో చల్లా రామచంద్రారెడ్డి

CTR: పుంగనూరు రూరల్ చండ్రమాకుల పల్లి గ్రామంలో నూతనంగా నిర్మించిన రామాలయంలో సోమవారం జరిగిన విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవాల్లో నియోజకవర్గ టీడీపీ ఇంఛార్జ్ చల్లా రామచంద్రారెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా గ్రామస్తులు అయనకు ఘనంగా స్వాగతం పలికారు. శ్రీ సీతా సమేత శ్రీ రామచంద్ర మూర్తుల విగ్రహాలను దర్శించారు. అర్చకులు స్వామివారి తీర్థ ప్రసాదాలను అందజేశారు.