తాగునీటి సమస్యలను పరిష్కారించాలి:కలెక్టర్

ములుగు: జిల్లాలోని తాడ్వాయి మండలంలోని లింగాల గ్రామంలో శుక్రవారం జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి అధికారులతో పర్యవేక్షించారు. నీటి ఎద్దడి ఏర్పడే అవకాశం ఉన్న ప్రాంతాల్లో వాల్వుల పనితీరు పరిశీలించాలని సూచించారు. రాబోయే మూడు నెలలలో గ్రామాలలోని ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా త్రాగునీరు అందించాలని అధికారులను ఆదేశించారు.