విద్యాపీఠంలో విద్యార్థుల ఆందోళన
TPT: తిరుపతి జాతీయ సాంస్కృతిక విద్యాపీఠంలో విద్యార్థులు ఆందోళనకు దిగారు. భోజనం నాణ్యతగా లేదంటూ మండిపడ్డారు. ఈ మేరకు బీసీ భవనం ఎదుట బైఠాయించారు. ఉడకని ఆహారం, నాణ్యత లేని కూరలు, ఎండిన రొట్టెలు పెడుతున్నారని, పారిశుద్ధ్యం కరువైందని వాపోయారు. తక్షణం VC వచ్చి సమస్యను పరిష్కరించాలని డిమాండ్ చేశారు.