VIDEO: సామాన్యుడిలా పర్యటించిన ఎమ్మెల్యే
ELR: జీలుగుమిల్లి మండల కేంద్రంలో సోమవారం పోలవరం ఎమ్మెల్యే చిర్రి బాలరాజు పర్యటించారు. ఒక చిన్న జ్యూస్ స్టాల్ వద్ద ఆగి సామాన్యుడిలా ప్రజలతో మాట్లాడారు. అక్కడికి వచ్చిన స్థానికులతో ఆత్మీయంగా మాట్లాడి వారి సమస్యలను తెలుసుకున్నారు. ప్రతి సమస్యను ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లి పరిష్కారం కోసం కృషి చేస్తానని హామీ ఇచ్చారు.