కుక్కల నియంత్రణ కేంద్రంలో ఘర్షణ

గుంటూరు ఏటుకూరు రోడ్డు వద్ద డంపింగ్ యార్డ్‌లోని కుక్కల నియంత్రణ కేంద్రంలో ఘర్షణ జరిగింది. స్టెరిలైజేషన్ చేసిన కుక్కలను తీసుకొచ్చిన చోటే వదలకుండా వేరే ప్రాంతాల్లో విడిచిపెడుతున్నారని జంతు ప్రేమికుడు సురేశ్ అభ్యంతరం తెలిపాడు. దీనిపై సిబ్బంది సూర్యనారాయణతో ఘర్షణ ఏర్పడింది. ఘర్షణ తీవ్ర రూపం దాల్చి సూర్యనారాయణ కాలు విరిగింది.