ప్రజల నుంచి అర్జీలను స్వీకరించిన కలెక్టర్
కృష్ణా: మచిలీపట్నం కలెక్టరేట్లో సోమవారం జరిగిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో కలెక్టర్ బాలాజీ ప్రజల వద్ద నుంచి అర్జీలను స్వీకరించారు. ఈ సందర్భంగా కొన్ని సమస్యలను కలెక్టర్ అక్కడికక్కడే పరిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. అర్జీల రూపంలో వచ్చిన సమస్యలను అధికారులు త్వరితగతిన పరిష్కరించాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.