ప్రమాదాలకు నిలయంగా 44వ జాతీయ రహదారి

ATP: ఉమ్మడి జిల్లాలో 44వ జాతీయ రహదారి ముఖ్యంగా పెనుకొండ, గోరంట్ల, సోమందేపల్లి మండలాల్లో పారిశ్రామికవాడ జాతీయ రహదారి పక్కనే ఉండటంతో ఈ ప్రాంతంలో తరచూ ప్రమాదాలు చోటు చేసుకొంటున్నాయి. ఈ ఏడాది ఇప్పటివరకు కియా ఇండస్ట్రీయల్ ఏరియా పీఎస్ పరిధిలో 12, పెనుకొండ పరిధిలో 14 మొత్తం 26 ప్రమాదాలు చోటు చేసుకొన్నాయి. ప్రమాదాల చర్యలు చేపట్టడంలో అధికారులు విఫలమవుతున్నారని స్థానిక ప్రజలు పేర్కొన్నారు.