'జిల్లాలోని పాఠశాలల్లో స్మార్ట్ కిచెన్లు ఏర్పాటు చేయాలి'

'జిల్లాలోని పాఠశాలల్లో స్మార్ట్ కిచెన్లు ఏర్పాటు చేయాలి'

ATP: ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు మరింత నాణ్యమైన, రుచికరమైన భోజనం అందించేందుకు స్మార్ట్ కిచెన్ల ఏర్పాటుకు అడుగులు పడుతున్నాయి. జిల్లాలోని 31 మండలాల్లో 52 స్మార్ట్ కిచెన్లను ఏర్పాటు చేయాలని DEO ప్రసాద్ బాబు ప్రతిపాదనలు సిద్ధం చేశారు. ఈ మేరకు కలెక్టర్ ఆనంద్‌కు నివేదిక సమర్పించారు. కలెక్టర్ ఆమోదం తర్వాత ఈ ప్రతిపాదనలను ప్రభుత్వానికి పంపనున్నారు.