నీటి సంపునకు భూమి పూజ

KRNL: ఆలూరు మండలం మొల్లగవల్లి కొట్టాల గ్రామంలో తాగునీటి సంపునుకు ఎమ్మెల్యే బుసినే విరుపాక్షి భూమి పూజ చేశారు. గ్రామంలో తాగునీటి సరఫరా కోసం ప్రత్యేక చర్యలలో భాగంగా సంపు నిర్మాణం చేపట్టామన్నారు. సంబంధిత అధికారులు వేసవిని దృష్టిలో ఉంచుకొని తాగునీటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు.