ఆర్డీవో కార్యాలయాన్ని సందర్శించిన కలెక్టర్
కృష్ణా: గుడివాడ ఆర్డీవో కార్యాలయాన్ని జిల్లా కలెక్టర్ బాలాజీ బుధవారం సందర్శించారు. పలు రికార్డులను బుధవారం పరిశీలించారు. వివిధ అంశాలకు సంబంధించిన రిజిస్టర్‌లు, నెలవారి నివేదికలు, పలు సర్వేల పురోగతి, కార్యాలయంలోని ఖాళీ పోస్టులు తదితర వివరాలపై గుడివాడ ఆర్డీవోను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన రిజిస్టర్ పే బిల్, ట్రెజరీ రీకన్సలేషన్‌ను పరిశీలించారు.